ఆందోళనలో జగన్ ఫ్యాన్స్: రచ్చబండ… గాలిమోటారెక్కకుండా!

-

అసలే రచ్చబండ.. ఆపై సెప్టెంబరు నెల.. పైగా గాల్లో ప్రయాణం.. ఈ మాటలే జగన్ ఫ్యామీలీ మెంబర్స్ ని, వైకాపా నేతలను, జగన్ అభిమానులను… మొత్తంగా రాష్ట్ర ప్రజలను భయానికి గురిచేస్తున్నాయి! కారణం… సెప్టెంబరు నెలలోనే.. రచ్చబండ కార్యక్రమానికనే.. హెలీకాప్టర్ ఎక్కిన రాజన్న కనిపించకుండా పోయారు.. తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు! ఆ బాధ, ఆవేదన ఆ కుంటుంబానికే కాదు.. రాష్ట్ర ప్రజలకు కూడా తీర్చలేనిది.. పూడ్చలేనిది! ఈ క్రమంలో జగన్ తీసుకున్న తాజా నిర్ణయం గుండెల్లో గుబులురేపుతుందని అంటున్నారు ప్రజానికం!

అవును… ప్రస్తుతం జగన్ “రచ్చబండ” పేరు చెప్పి గ్రామాలో పర్యటించి.. సర్వేలూ, సీఎస్ లు చెప్పినవే పూర్తి వాస్తవాలు కాకపోవచ్చని భావిస్తూ… జనాల్లోకి వెళ్లాలని నిర్ణయించారు! “తన పాదయాత్ర ద్వారా జనాల కష్టాలు తెలుసుకున్న జగన్… తన ఏడాది పాలన అనంతరం వారి జీవితాల్లో వచ్చిన మార్పులను చూసి ఆనందించడానికి, ఇంకా తేవాల్సిన మార్పూలను గురించి నేరుగా ప్రజలనుంచే తెలుసుకోవడానికి” రచ్చబండ కార్యక్రమాన్ని ఫిక్స్ చేసుకున్నారు! అంతవరకూ అంతా సంతోషించే విషయమే కానీ… దానికి ఆయన ఎంచుకున్న తేదీ… సెప్టెంబరు లో కావడం, అది కూడా హెలీకాప్టర్ ఎక్కి వెళ్లనుండటంతో టెన్షన్ స్టార్ట్ అంటున్నారు అభిమానులు!

జనం విషయంలో జగన్ వెనక్కి తగ్గుతాడా… ససేమిరా సెప్టెంబరులోనే ఫిక్స్ చేయండని అధికారులతోనూ, కుటుంబ సభ్యులతోనూ, పార్టీ నేతలతోనూ చెబుతున్నారంట. దీనికి వారంతా కలిసి పెట్టినవి మూడు కండిషన్స్ గా చెబుతున్నారు. అందులో ఒకటి “రచ్చబండ” పేరును “గ్రామసభ” గా మార్చమని కాగా… రెండోది “హెలీకాఫ్టర్” లో వద్దు, కార్ లోనే వెళ్లమని అంట… ఇక మూడోది “సెఫ్టెంబర్” లో వద్దు “అక్టోబర్” నుంచి పెట్టుకోమనంట!

దీంతో వారందరి మాట ఎందుకు కాదనడంలే అని భావించారో ఏమోకానీ… మొదటి రెండు ఆప్షన్స్ కి “ఓకే” కానీ… మూడో అప్షన్ విషయంలో తగ్గేది లేదని, సెప్టెంబరు లోనే స్టార్ట్ చేసేద్దామని అంటున్నారట!! “మోడోడు రాజుకంటే బలవంతుడు అంటారు.. అలాంటిది మోడోడే రాజైతే..” అనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపించడం కొసమెరుపు!

Read more RELATED
Recommended to you

Latest news