కలియుగ కీచకుడు జగన్ రెడ్డి అంటూ టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. సొంత తల్లి, చెల్లిని తరిమేసి.. బాబాయ్ కూతురిపైనా మార్ఫింగ్ పోస్టులతో సోషల్మీడియా వేదికగా దాడులు చేయిస్తోన్న కలియుగ కీచకుడు జగన్ రెడ్డి అంటూ రెచ్చిపోయారు లోకేష్. సొంత బాబాయ్ ని చంపేసి అక్రమసంబంధాలు అంటకట్టిన దుర్మార్గుడు సైన్యం, సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తున్న అక్కాచెల్లెమ్మలపై పడిందని ఆగ్రహించారు.
ఎన్ఆర్ఐ సోదరి స్వాతిరెడ్డి ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక వైకాపా కిరాయి మూకలు చేస్తున్న ఫేక్ మార్ఫింగ్ దాడులు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని ఫైర్ అయ్యారు నారా లోకేష్. వైకాపా పేటీఎం గ్యాంగుల ఫేక్ బూతురాతలకి జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, డిజిపి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సోదరి స్వాతిరెడ్డి నీ వైపు న్యాయం ఉంది. తెలుగుదేశం నీకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు నారా లోకేష్.