బద్వేల్ లో ప్రేమోన్మాదికి బలైన యువతి కుటుంబానికి వైసీపీ సాయం

-

కడప జిల్లా బద్వేల్ లో ఇంటర్మీడియట్ చదివే 16 ఏళ్ల యువతిని ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంంటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన లో ఆ బాలికను తొలుత బద్వేలు కమ్యూనిటి ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం చంద్రబాబు గారూ? మహిళలకు, బాలికలకు రక్షణకూడా ఇవ్వలేకపోతున్నారు… ఇదేమి రాజ్యం? ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం అని పేర్కొన్నారు జగన్. తాజాగా ప్రేమోన్మాదికి బలైన యువతి కుటుంబానికి మాజీ సీఎం జగన్ తరపున వైసీపీ నేతలు రూ.10లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఎంతైనా ఉందన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news