ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వైయస్సార్ కళ్యాణమస్తు షాదీతోఫా పథకం కింద ఇవాళ ఆర్థిక సాయం ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. గతేడాది అక్టోబర్ 1 నుంచి 31 మధ్యాహ్నం మ్యారేజ్ చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతలకు ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఈ పథకం క్రింద లబ్దిదారులకు రూ. 38.18 కోట్ల ఆర్ధిక ప్రయోజనం జరుగనుంది. ఇక వర్చువల్ గా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్.
పూర్తి వివరాల్లోకి వెళితే,
ఎస్సీ వివాహాలకు రూ.లక్ష, కులాంతరమైతే రూ.1.20 లక్షలు
ఎస్టి వివాహాలకు రూ.లక్ష, కులాంతరమైతే రూ. 1.20 లక్షలు
బిసి వివాహానికి రూ. 50,000, బీసీ కులాంతర వివాహానికి రూ.75000
మైనార్టీల వివాహానికి రూ. లక్ష
దివ్యాంగుల వివాహానికి రూ. 1.50 లక్షలు
భవన నిర్మాణ కార్మికుల వివాహానికి రూ. 40 వేల సాయం చేస్తారు.