వైసీపీ మంత్రులా మ‌జాకానా… .ఏం న‌టించేస్తున్నారు గురూ…!

వైసీపీ మంత్రుల‌పై చాలా హాట్ టాపిక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మంత్రులా.. మ‌జాకానా.. అంటూ.. సాగుతు న్న ఈ టాపిక్‌.. నిజంగానే మంత్రులు ఇంత హాట్‌హాట్‌గా ఉంటారా? అని అనిపిస్తోంది. అయితే, రాజ‌కీయంగా వారు ఎన్ని ఎత్తులు వేసినా ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, అధినేత జ‌గ‌న్‌కే మ‌స్కా కొట్టేలావ్య‌వ‌హ‌రిస్తుండ‌డం ఇప్పుడు మంత్రుల‌ను రింగులోకి లాగుతోంది. అయితే.. అంద‌రూ కాక‌పోయినా.. ఓ ఐదు నుంచి ప‌ది మంది వ‌ర‌కు మంత్రులు జ‌గ‌న్ క‌ళ్ల‌కు గంత‌లు క‌డుతున్నార‌ని అంటు న్నారు.. ప‌రిశీల‌కులు. మంత్రులు అందరూ జ‌గ‌న్ ఏం చెప్పినా.. `ఓకే బాస్‌` అంటున్నారు. విన‌యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు.


ఈ విష‌యం కొత్త‌గా చెప్పేది లేదు. కానీ, కొంద‌రు మాత్రం పైకి ఓకే అంటున్నా.. వెన‌క మాత్రం తూచ్ అంటున్నార‌ట‌. ఇదీ ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. వీరిలో హోం మంత్రి సుచ‌రిత పేరు ప్ర‌గాఢంగా వినిపిస్తోంది. అత్యంత కీల‌క‌మైన పొజిష‌న్‌లో ఉన్న సుచ‌రిత‌ను నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితులు చూడ‌మ‌ని .. జ‌గ‌న్ చెబుతున్నారు. అదే స‌మ‌యంలో కుటుంబాన్ని సాధ్య‌మైనంత వ‌ర‌కు మంత్రి బాధ్య‌త‌ల‌కు దూరంగా ఉంచాల‌ని అంటున్నారు. అయినా ఆమె వినిపించుకోవ‌డం లేదట‌. ఎక్క‌డికి వెళ్లినా.. భ‌ర్త స‌మేతంగా హాజ‌రవుతుండ‌డం గ‌మ‌నార్హం అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, మేక‌పాటి గౌతం రెడ్డి. జ‌గ‌న్ ఈయ‌న‌కు ఇటీవ‌ల మంచి బాధ్య‌త‌లు అప్ప‌గించారు.  మంత్రిగా ఉండ‌డ‌మే కాదు.. నెల్లూరు ఇజ‌ల్లాలో పార్టీని న‌డిపించే బాథ్య‌త కూడా నువ్వే తీసుకోవాలి. అని సూచించారు. అయితే, ఆయ‌న మాత్రం త‌న మ‌టుకు తాను ఓకే అనేసి.. మ‌ళ్లీ య‌థాత‌థంగా త‌న వ‌ద్ద‌కు వ‌చ్చేవారికి తానేమీ చేయ‌లేన‌ని చెప్పేస్తున్నార‌ట‌. ఇక‌, అనంత‌పురం జిల్లాకు చెందిన మంత్రి శంక‌ర‌నారాయ‌ణ‌ను కూడా నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్ట‌మంటే.. ఆయ‌న ఏకంగా బెంగ‌ళూరుకు వెళ్లి సెటిల్ అవుతున్నార‌ట‌. ఇక‌,మంత్రి కొడాలి నాని గారికి.. అన్నా నువ్వు కొంచెం దూకుడు త‌గ్గించాలంటే.. ఓకే అనేసి .. మ‌ళ్లీ మామూలే.. అయిపోతున్నారు.

మ‌రికొంద‌రు మంత్రుల్లో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. మ‌రి ఆయ‌న విజృంభిస్తారో లేదో చూడాలి. సైలెంట్ వెనుక జ‌గ‌న్ వ్యూహం ఉంద‌ని అంటున్నారు. బొత్స కూడా మెత్త‌బ‌డ్డారు. ఆయ‌న‌కు కూడా జ‌గ‌న్ కొన్ని సూచ‌న‌లు చేశార‌ట‌. ఇలా ఏడుగురు వ‌ర‌కు మంత్రుల‌కు జ‌గ‌న్ సూచ‌న‌లు చేస్తే.. కొంద‌రు పాటిస్తున్నా.. చాలా మంది మాత్రం ఆయ‌న ముందు ఓకే అనేసి.. త‌ర్వాత మాత్రం త‌మ ప‌నిలో తాము ఉన్నార‌ని అంటున్నారు. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.