ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో ఇవాళ గవర్నర్ ధన్యవాద తీర్మాణ సభలో మాట్లాడారు. రెండు నెలలు సమయం తీసుకుని బడ్జెట్ పెట్టాలనే ఆలోచనకు వచ్చాం. పీవీ ఆర్థిక సంస్కరణలు దేశంలో పెనుమార్పులకు నాంది పలికాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధ్యమైంది. వికసిత్ భారత్ 2047కు ప్రపంచంలోనే భారత్ మొదటి లేదా రెండో స్థానానికి వస్తుంది.
విజన్ 2020 తయారుచేశాక అభివృద్ధి ప్రారంభించాం. ఆనాడు ఐటీకి ప్రాధాన్యమిచ్చాం. ఇవాళ మనవాళ్లు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా కనిపించే పరిస్థితి. జూన్ 4న వెలువడిన ఫలితాలు ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయి. 93 శాతం స్ట్రైక్ రేట్.. 57 శాతం కూటమికి ఓట్లు పడ్డాయి. నా రాజకీయ జీవితంలో ఏ రాజకీయ పార్టీకి ఇలాంటి ఫలితాలు చూడలేదు. ఈ స్థాయి విజయానికి చాలా కృషి ఉంది.
గత ఐదేళ్లు చాలా ఇబ్బందులు పడ్డాం. జైలుకు వచ్చి పవన్‌కల్యాణ్ నన్ను పరామర్శించారు. క్లిష్ట సమయంలో ఓటు చీలకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో పవన్ ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయని మొదటగా పవన్ చెప్పారు. ఇద్దరం కలిసిన అనంతరం బీజేపీ కూడా ముందుకొచ్చింది. మూడు పార్టీలు కలిశాక ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయి
మరోవైపు హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుంది. వివేకా హత్య కేసు పలు మలుపులు తిరిగింది. వివేకా హత్య జరిగాక ఘటనాస్థలికి సీఐ వెళ్లారు. సీబీఐకి విషయం తెలపడానికి సీఐ సిద్ధపడ్డారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి సీఐకి పదోన్నతి ఇచ్చింది