అత్యాచారాలకు ఎల్లప్పుడు కామాయేనా, పుల్ స్టాప్ ఎప్పుడు..? : వంగలపూడి అనిత

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. సీఎం కావాలనే టార్గెట్ తో అక్క చెల్లెమ్మలచే ఓట్లేయించుకొని సీఎం అయ్యాక అత్యాచారాలు, హత్యలు, దాడులు జరిగినా నిమ్మకు నీరెత్తినట్లున్నాడని.. అత్యాచారాలకు ఎల్లప్పుడు కామాయేనా, పుల్ స్టాప్ ఎప్పుడు..? అని నిలదీశారు.

ప్రతినిధుల వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్షం, జగన్ బాధ్యతా రాహిత్యమే నిదర్శనమని.. అత్యాచారాలపై పోలీసు శాఖతో, డీజీపీతో సమీక్షలు జరిపిన దాఖలాలు లేవని ఫైర్‌ అయ్యారు. అత్యాచారాలు యాధృచ్ఛికమని హోం మంత్రి మాట్లాడటం బాధ్యతా రాహిత్యమని.. నారాయణను అరెస్టు చేయడం కొండను తవ్వి ఎలకను పట్టడమేనని నిప్పులు చెరిగారు.

తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్ సామాన్యులకేం చేయగలడు..? అని ఫైర్‌ అయ్యారు. రాష్ట్రంలో గన్ కల్చర్ వచ్చినా అఘాయిత్యాలప్పుడు జగన్ రాడని.. జగన్ కు భజన చేసి మంత్రులైనవారు ఇప్పటికైనా అత్యాచారాలపై స్పందించాలని డిమాండ్ చేశారు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత.

Read more RELATED
Recommended to you

Latest news