ఒక్క మద్యం ద్వారానే జగన్ నెలకు రూ.500 కోట్లు సంపాదిస్తున్నారు – వంగలపూడి అనిత

-

అతి చిన్నదైన అదాన్ డిస్టలరీస్ కు 2019 నుంచి రూ. 2 వేల కోట్ల పైబడి టర్నోవర్ ఎలా సాధ్యమైంది? అని… 42 బ్రాండ్లు ఒక్క అదాన్ డిస్టలరీస్ పంపిణీ చేయటం వెనుక విజయసాయి ఇతర వైసీపీ పెద్దలున్నారని ఆరోపించారు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత. 60 లక్షలకు పైగా మద్యం కేసులు ఈ కంపెనీ పంపిణీ చేస్తే దాదాపు రూ. 1100 కోట్లు ప్రభుత్వం అదాన్ డిస్టలరీస్ కు ఇప్పటివరకు చెల్లించిందని.. ఒక్క మద్యం ద్వారానే జగన్ నెలకు రూ.500 కోట్లు పైబడి సంపాదిస్తున్నారని ఆగ్రహించారు.

అప్పులు తెచ్చేందుకు మహిళలు తాళిబొట్లు తెంపే ప్రభుత్వం జగనుదని.. మద్యపాన నిషేధం అంటూ వైఎస్ ఫోటోతో ప్రచారం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు వైఎస్ ఫోటో తొలగించి మద్య నియంత్రణ అంటూ మాట మార్చారని నిప్పులు చెరిగారు. జనాల రక్తం తాగి, సంక్షేమం పేరుతో బిస్కెట్లు వేస్తారా? టీడీపీ ప్రభుత్వంలో మద్యం ద్వారా రూ.6400 కోట్లు ఆదాయం వస్తే.. వైసీపీ ప్రభుత్వం లో రూ.25వేల కోట్ల ఆదాయం వస్తోందన్నారు. ఆదాన్ డిస్టలరీసుకు తెలుగుదేశం ప్రభుత్వం అనుమతులిస్తే జగన్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ? అని నిలదీశారు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత.

Read more RELATED
Recommended to you

Latest news