ఎంపీ గోరంట్ల వీడియోపై కేంద్రానికి ఫిర్యాదు !

-

ఎంపీ గోరంట్ల వీడియోపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని టిడిపి మాజీ ఎమ్మెల్యే అనితా వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని గవర్నర్ ను కోరామని..నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వ వైఖరి ఉందని ఫైర్ అయ్యారు. పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదన్నారు.

ఎంపీ మాధవ్ కెమెరా ముందు కూర్చుని ఛాలెంజ్ విసురుతాడా ? అని ఆగ్రహించారు. ఈ వ్యవహారంపై గవర్నర్ బాధపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ ఫకిరప్ప శాటిలైట్ టెక్నికల్ ద్వారా క్రిమినల్స్ ను పట్టుకోవటంలో సిద్ధహస్తుడన్నారు. కానీ అలాంటి వ్యక్తి ఒరిజినల్ వీడియో ఉంటేనే కానీ చెప్పలేం అనటం అనుమానాలకు దారి తీస్తున్నాయి అని నిప్పులు చెరిగారు. ఎంపీ మాధవ్ తప్పు చేశాడు… ఇంకా చేస్తూనే వున్నాడు…త్వరలో జేఏసి తరుపున డిల్లీ వెళ్తాం అని స్పష్టం చేశారు.లోక్ సభ స్పీకర్, చీఫ్ జస్టిస్ కు పిర్యాదు చేస్తాం…ఎంపీ బర్తరఫ్ అయ్యే వరకు  పోరాడుతామని హెచ్చ రించారు టిడిపి మాజీ ఎమ్మెల్యే అనితా.

Read more RELATED
Recommended to you

Latest news