మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ కీలక నిర్ణయం

-

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు తెలంగాణ ఏఐసిసి ఇంచార్జ్ సెక్రటరీ బోసు రాజు. ఆగస్టు 16, 18, 19 తేదీల్లో మూడు రోజుల పాటు మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమేవేశాలు నిర్వహించాలని వెల్లడించింది.

ఆగస్టు 16 న రెండు మండలాలు, 18 న మరో రెండు మండలాలు, ఆగస్టు 19 న మిగిలిన రెండు మండలాలకు చెందిన కార్యకర్తల సమావేశాలు ఉంటుందన్నారు.మునుగోడు అసెంబ్లీనియోజకవర్గానికి ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఉపఎన్నికకు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా సమావేశాలు జరుగనున్నాయని పేర్కొంది.

ఆగస్టు 20 న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 175 గ్రామాల్లోనూ రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు జరుగుతాయని… 175 గ్రామాల్లో, ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్ పార్టీ కి చెందిన కీలకమైన నాయకుడు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు నిర్వహణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ….ఇంటింటికి వెళ్లి పలకరింపులు….ప్రజలతో మమేకమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news