ఈ నెల పెళ్లి, చైనాలో ఉండిపోయిన కర్నూలు అమ్మాయి…!

-

భారత్ లో మరో కరోనా కేసు నమోదు అయింది. కేరళలోని తిరుచ్చిలో వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తిని అధికారులు గుర్తించారు. దీనితో అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మొన్నీ మధ్య కూడా కేరళలోనే కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. ఆ వ్యక్తి సింగపూర్ నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. అతనికి ఆ వ్యాధి ఉండటంతో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కాగా హైదరాబాద్ లో గాంధీ ఆస్పత్రిలో రేపటి నుంచి కరోనా వ్యాధి టెస్టులు చేయనున్నారు అధికారులు. దీనికి కేంద్రం అనుమతి ఇచ్చింది. చైనాలోని ఊహాన్ నగరం నుంచి రెండో విమానం భారత్ కి వచ్చింది. ఈ విమానంలో 323 మందిని తరలించారు. కాసేపటి క్రితం ఢిల్లీ విమానాశ్రయంలో విమానం దిగింది. ఇక ఇదిలా ఉంటే కర్నూలు జిల్లా ఈర్ణపాడుకి చెందిన శృతి ఊహాన్ లో చిక్కుకుంది.

ఆమెకు జ్వరం ఉండటంతో భారత్ కి వచ్చిన రెండు విమానాల్లోను అధికారులు ఆమెను అనుమతించలేదు. ఈ నేపధ్యంలో ఆమె ఒక వీడియో రికార్డ్ చేసారు. తనకు కరోనా వైరస్ లేదని.. అసలు ఆ లక్షణాలు కూడా తనకు లేవని ఆమె చెప్పింది. ఇటీవల ఆమెకు నిశ్చితార్ధం జరిగింది. ఈ నెల 14 న ఆమె వివాహం ఉండటంతో కుటుంబం సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news