బిగ్ బాస్ 6 తో మరొక ప్రేమ జంటకు బ్రేకప్..!

-

ప్రస్తుతం తెలుగులో రియాల్టీ షోగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ ఐదు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చూసుకొని ఆరవ సీజన్లు కొనసాగిస్తోంది. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో కొన్ని కొత్త ప్రేమ జంటలు ఉత్పన్నమైతే.. మరికొన్ని ప్రేమ జంటలు బ్రేకప్ అవుతున్నాయి. ఇదివరకే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కూడా షణ్ముఖ్, సిరి చేసిన కొన్ని పనులను షణ్ముఖ్ లవర్ దీప్తి సునైనా జీర్ణించుకోలేక అతడికి బ్రేకప్ చెప్పింది . ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీహన్, శ్రీ సత్య చేసే పనులకు విసిగిపోయిన సిరి హనుమంతు కూడా బ్రేకప్ చెప్పబోతోందా? అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే.. ఈవారం 9 మంది కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్నారు. అయితే ఇందులో బయటకు పోకుండా ఉండడానికి బిగ్ బాస్ ఒక ఎడిక్షన్ ఫ్రీ పాస్ గురించి తెలిపాడు. మొదటగా బజర్ ప్రెస్ చేసిన వాళ్ళు ఒక్కోస్లాట్ ని కొనుగోలు చేస్తారో వాళ్ళు ఎడిషన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడే అవకాశం ఉంటుందని తెలిపారు. అలా రేవంత్ , శ్రీహాన్ , ఫైమా ముగ్గురు బజార్ మొదటగా ప్రెస్ చేశారు. మరొకవైపు ఆదిరెడ్డి నేను అసలు ఈ గేమ్ ఆడను అని పట్టుబట్టి కూర్చున్నాడు. ఇక ఇందులో భాగంగా శ్రీహన్ నేను ఈ పాస్ గెలిస్తే ఖచ్చితంగా నీకే ఉపయోగిస్తానని శ్రీ సత్యతో తెలిపాడు.. ఎందుకని శ్రీ సత్య అడిగితే నువ్వు ఒక్క వారమైనా నాతో కలిసి ఉంటావు కదా అని శ్రీహాన్ అన్నాడు.

శ్రీ హాన్ అన్న మాటలకు శ్రీ సత్య ముఖం మీద చెయ్యి పెట్టుకొని మరి సిగ్గు పడిపోయింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే శ్రీహాన్ కి ముందే సిరి హనుమంతుతో రిలేషన్ ఉంది. కానీ హౌస్ లో శ్రీ సత్య తో పులిహోర కలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వీరిద్దరూ ఇప్పుడు హౌస్ నుంచి బయటికి వచ్చిన ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు. ఇదివరకే సిరి, షణ్ముఖ ప్రవర్తన అలాగే అనిపించింది. ఎట్టకేలకు దీప్తి బ్రేకప్ చెప్పేసింది ప్రస్తుతం శ్రీ సత్య శ్రీహాన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇది చూసిన నెటిజెన్లు పాపం సిరి కూడా దీప్తి లాగా ఒంటరి అయిపోతుందేమో అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు . మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news