మంత్రి కేటీఆర్ న్యాయం చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇష్యూ లో మరో విడియో విడుదల అయింది. ఎమ్మెల్యే అనుచరులు తమ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ ను బెదిరిస్తున్నారని ఆరిజన్ డెయిరీ సీ ఏ ఓ (Chief administrative officer)శేజల్ పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజక వర్గం గంగవరం వెళ్ళి ఎమ్మెల్యే అనుచరుడు భీమా గౌడ్ బెదిరించాడని ఫొటో లు విడుదల చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు…తాము ఒంటరి పోరాటం చేస్తున్నామని.. మంత్రి కేటీఆర్ న్యాయం చేయాలని వీడియో లో యువతి శేజల్ విజ్ఞప్తి చేసింది. తమకు కలిసే అవకాశం ఇవ్వాలని వేడుకుంది. పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు.. పైగా ఎమ్మెల్యే కు సపోర్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.