చీమలు క్యాన్సర్‌ను గుర్తించగలవట..! కనిపెట్టేసిన శాస్త్రవేత్తలు..!

-

క్యాన్సర్‌ ఒక ప్రాణంతకమైన వ్యాధి.. ఇది సోకిన వారికి చావు తప్పదు.. కాకపోతే అది ఎన్నిరోజులు అనేది మన వైద్యవిధానం బట్టి ఉంటుంది..చాలామంది ఇలానే అనుకుంటారు. క్యాన్సర్‌ ప్రమాదకరమైనది తెలిసినప్పుడు.. దాన్ని ప్రేరేపించే పనులు ఎందుకు చేయడం.. ఇది ఎలా ఉంటుందంటే.. నిప్పు కాలుతుందని తెలిసి కూడా అందులో వేళ్లుపెట్టినట్లు. ఇప్పుడు వైద్యరంగం అభివృద్ధి చెందింది. క్యాన్సర్‌ను ముందే కనిపెట్టగల టెక్నాలజీ వచ్చింది. పరికరాల సాయంతోనే కాదు.. జంతువులు కూడా క్యాన్సర్‌ను గుర్తించగలుగుతున్నాయట. ఇప్పుడు ఈ లిస్ట్‌లో చీమలు కూడా చేరాయి. చీమలకు క్యాన్సర్‌ను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ants
antsants

భారతదేశంలో 2.25 మిలియన్లకు పైగా క్యాన్సర్ రోగులు ఉన్నారు. ఈ రోజుల్లో రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా గుర్తించబడుతున్నాయి. క్యాన్సర్ నివారించబడదు. కానీ కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి(Lifestyle) అలవాట్లను అనుసరించడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కానీ ఒక పరీక్ష మాత్రమే క్యాన్సర్ ఉనికిని నిర్ధారించదు. బయాప్సీ, సీటీ స్కాన్, బోన్ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్, ప్రోటాన్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కాన్ (పీఈటీ), అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే ద్వారా క్యాన్సర్‌ను గుర్తించవచ్చు.

చీమలు క్యాన్సర్‌ని గుర్తించగలవా?

ఇటీవలి అధ్యయనం ప్రకారం.. మూత్రం ద్వారా క్యాన్సర్‌ను గుర్తించేందుకు చీమలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మూత్రం వాసన సహాయంతో క్యాన్సర్‌ను గుర్తించే శక్తి చీమలకు ఉంది. జంతువులకు వాటి ఇంద్రియాలకు అపూర్వమైన శక్తులు ఉంటాయి…వాసన ద్వారా అన్నీ తెలుసుకునే శక్తి వాటికి ఉంది. ఉదాహరణకు ఆహారాన్ని కనుగొనడం, మాంసాహారం, సహచరులను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

చీమలు క్యాన్సర్ కణాలను గుర్తిస్తాయి. చీమల యాంటెన్నాలో అసాధారణమైన వాసన గ్రాహకాలు ఉంటాయి. వివిధ రకాల వాసనలను గుర్తిస్తాయి. చీమలు ఒక వస్తువులోని వివిధ రకాల వాసనలను గుర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. చీమలకు మంచి జ్ఞాపకశక్తి ఉందని అధ్యయనాలు రుజువు చేశాయి. చీమలు కేవలం ఒక శిక్షణ తర్వాత దీర్ఘకాలిక జ్ఞాపకాలను కలిగి ఉంటాయి. ఇటీవల అధ్యయనంలో 9 టెస్టుల తర్వాత కూడా సరైన సమాధానాలు వచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

చీమలు కేవలం మూడు శిక్షణా సెషన్ల తర్వాత క్యాన్సర్ కణాలను గుర్తించాయి. అందువల్ల చీమలు క్యాన్సర్ గుర్తింపు కోసం చౌకైన, ఉపయోగకరమైన సాధనంగా మారాయని పరిశోధకులు అంటున్నారు..

కుక్కలను ఉపయోగించి.. క్యాన్సర్ కణాలను గుర్తించినట్టుగానే.. చీమలతోనూ ప్రయోగం చేశారు. బయో డిటెక్టర్లను గుర్తించడంలో కుక్కలతో చీమలు సమానమైన ప్రతిభతో ఉన్నాయి. మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. శునకాలకు 6 నుంచి 12 నెలల పాటు శిక్షణ ఇవ్వాలి. కానీ చీమలకు 30 నిమిషాల్లో ట్రైనింగ్ పూర్తి చేయొచ్చట. ఇదంతా బానే ఉంది.. అంటే భవిష్యత్తులో చీమలకు ట్రైనింగ్ ఇచ్చి క్యాన్సర్‌ను గుర్తిస్తారా..?అంటే క్యాన్సర్‌ టెస్ట్‌ సెంటర్లో చీమలను పెంచుతారా..?చీమలు ఇచ్చిన రిజల్ట్‌తో వైద్యం చేసేస్తారా..? ఇన్ని ప్రశ్నలు తలెత్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news