మహాశివరాత్రి వేడుకల్లో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అనుష్క..!

-

లేడీ సూపర్ స్టార్ గా అభిమానులను అలరించిన అనుష్క శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆచితూచి సినిమాల ఎంపిక విషయంలో అడుగులు వేసే ఈమె బాహుబలి 2 సినిమా తర్వాత కేవలం భాగమతి, నిశ్శబ్దం వంటి రెండు చిత్రాలు మాత్రమే చేసింది. అనుష్క ప్రస్తుతం బరువుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎక్కువ చిత్రాలలో ఆమె నటించడానికి ఆసక్తి చూపించడం లేదని సమాచారం.

ప్రస్తుతం అనుష్క శెట్టి యు వి క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి సరసన ఒక సినిమాలో నటిస్తోంది ఇకపోతే సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండని ఈమె బయట కనిపించడం కూడా చాలా అరుదు. గత కొన్నేళ్ల క్రితం అనుష్క దర్శనమే అభిమానులకు కరువైంది. ఇదిలా ఉండగా నిన్న మహాశివరాత్రి సందర్భంగా అనుష్క బెంగళూరులోని ఒక శివాలయంలో కనిపించింది. మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొనడానికి అనుష్క తన కుటుంబంతో అక్కడికి వచ్చింది.

చాలా కాలం తర్వాత అనుష్క ని చూస్తున్న అభిమానులకి ఆమెలు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. చాలా బొద్దుగా మారి పోయింది. ట్రెడిషనల్ గా వైట్ చుడీదార్ లో అక్కడ భక్తిశ్రద్ధలతో అనుష్క కనిపించింది. దీంతో అనుష్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అనుష్క అందం లో మార్పు రాలేదు. కానీ ఆమె బరువు పెరిగింది అంటూ నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. అందుకే బహుశా సినిమాలకు దూరం కాబోతోంది ఏమో అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే చాలా కాలం తర్వాత అనుష్క ఇలా సోషల్ మీడియాలో కనిపించేసరికి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version