అవ‌కాశాలు రావలంటే అది చేయాల్సిందే .. అనుష్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్ప‌టి కే ప‌లువురు హీరోయిన్లు, న‌టీలు ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. తాజా గా టాలీవుడ్ అగ్ర హీరోయిన్ అనుష్క శెట్టి కూడా క్యాస్టింగ్ కౌచ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ అనుష్క శెట్టి షాకింగ్ కామెంట్స్ చేశారు. అవ‌కాశాలు ఇస్తామ‌ని న‌మ్మించి.. హీరోయిన్ల‌ను లోబ‌ర్చుకోవ‌డం టాలీవుడ్ లో జ‌రుగుతుంద‌ని అన్నారు. అలాంటి సంస్కృతి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కూడా ఉంద‌ని అన్నారు.

నిజానికి క్యాస్టింగ్ కౌచ్ అనేది తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కే కాకుండా దాదాపు అన్ని ఇండ‌స్ట్రీల‌లో ఉందంటూ బాంబ్ పేల్చారు. తాను సినీ పరిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన నాటి నుంచి ముక్కు సూటిగా ఉంటాన‌ని అన్నారు. త‌న మ‌న‌స్త‌త్వం గురించి తెలిసి.. ఎవ‌రూ కూడా త‌న‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని అన్నారు. త‌న‌కు అలాంటి ప‌రిస్థితి ఎదురు కాలేద‌ని అన్నారు. అయితే తోటి నటీలు క్యాస్టింగ్ కౌచ్ కు గురి అవుతున్నార‌ని అన్నారు. కాగ అనుష్క శెట్టి చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మ‌రో సారి క్యాస్టింగ్ కౌచ్ పై చ‌ర్చ‌కు దారి తీస్తుంది.

మరిదితో అక్రమ సంబంధం… మూడో భర్త అనుమానించాడని బిడ్డనే చంపుకున్న దుర్మార్గపు తల్లి

Read more RELATED
Recommended to you

Latest news