రోడ్డు ప్ర‌మాదంలో యువ‌ న‌టుడు మృతి

-

ఈ మ‌ధ్య సినీ ఇండ‌స్ట్రీలో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్న విష‌యం తెలిసిన‌దే. ఈ త‌రుణంలో బాలీవుడ్ న‌టులు ఇర్పాన్ ఖాన్ మ‌ర‌ణించిన విషాదం నుంచి కోలుకోక ముందే బాలీవుడ్ స్టార్ సీనియ‌ర్ హీరో రిషీ క‌పూర్ క‌న్నూమూశారు. మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. యువ నటుడు బేసిల్ జార్జ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిలో కూరుకుపోయారు.

తాజాగా మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. యువ న‌టుడు బేసిల్ జార్జ్ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెంద‌డంతో మాలివుడ్ ప్ర‌ముఖులు తీవ్ర దిగ్బ్రాంతిలో కూరుకుపోయారు. బేసిల్ జార్జ్ మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేసారు. మ‌ళ‌యాళ ఇండ‌స్ట్రీలో ఇప్పుడిప్పుడే త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న బేసిల్ జార్జ్ యాక్సిడెంట్ మ‌రణించాడ‌న్న వార్త ఇంకా జీర్ణించుకోలేక పోతున్నామంటున్నారు స‌హ‌న‌టులు. డ్రైవ‌ర్‌తో పాటు మొత్తం కారులో కొలెంచెర్రీ నుంచి మువ‌త్త‌పుజా వైపు వెళ్లుతున్నారు. డ్రైవ‌ర్ అదుపు కోల్పోవ‌డంతో ఎదురుగా ఉన్న షాపు, ఓ ఇంటిని కారు ఢీ కొట్ట‌డంతో ఘ‌ట‌న చోటు చేసుకుంది. బేసిల్ జార్జ్‌తోపాటు మ‌రొక‌ ఇద్దరు కూడా మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news