Anushka Shetty : వింత సమస్యతో బాధపడుతున్న స్వీటీ

-

ఈ మధ్య చాలా మంది నటీనటులు అరుదైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఇన్నాళ్లూ ఆ వ్యాధులతో ఒంటరిగా పోరాటం చేసిన వాళ్లంతా ఒక్కొక్కళ్లుగా సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. వారి అండతో కాస్త సులువుగా ఆ వ్యాధి బారి నుంచి పడేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే మయోసైటిస్ వ్యాధితో సమంత బాధపడుతున్న విషయం తెలిసిందే. తనతో పాటు కల్పికా గణేష్‌, మమతా మోహన్‌ దాస్‌, రేణు దేశాయ్‌ తదితర తారలు పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అవసరమైన చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరో హీరోయిన్ చేరింది.

ఆమె ఎవరో కాదు మన స్వీటీ.. దేవసేన.. అదేనంటి అనుష్క శెట్టి. అనుష్క ఓ విచిత్రమైన సమస్యతో బాధపడుతోందట. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ.. ‘నాకో అరుదైన వ్యాధి ఉంది. నవ్వే పరిస్థితి వస్తే పడి పడి నవ్వుతూనే ఉంటాను. దాన్ని అసలు కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు. 15 నుంచి 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటా. నేను నవ్వడంతో చాలాసార్లు షూటింగ్ కూడా ఆపేయాల్సి వచ్చింది. ఆ గ్యాప్‌లో ప్రొడక్షన్ టీమ్ తమ పనులను చక్క బెట్టుకుంటుంది’ అని చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news