విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం నడుబిగించింది. ఈమేరకు ఏపీ, తెలంగాణ సీఎస్ లకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఈ నెల 17న విభజన సమస్యలపై చర్చించడానికి ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశించింది. ఏపీ విభజన జరిగి ఎనిమిదేళ్ల కావస్తున్నా.. ఇంకా చాలా సమస్యలు అలాగే ఉన్నాయి. వీటిపై గతంలో కూడా ఇరు రాష్ట్రాలు పరిష్కరించాలంటూ కేంద్రాన్ని కోరాయి. తాజాగా ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్రం ఇరు రాష్ట్రాలను చర్చలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. తొమ్మది కీలకాంశాలు చర్చకు రానున్నట్లు తెలసింది. స్టేట్ కార్పోరేషన్ల విభజన, ఏపీ తెలంగాణ మధ్య విద్యుత్ పంపిణీ, రెండు రాష్ట్రాల మధ్య పన్ను బకాయిలు, రెండు రాష్ట్రాల మధ్య డిపాజిట్ల చెల్లింపు, విద్యుత్ సంస్థల వివాదం, వెనకబడిన జిల్లాల అభివ్రుద్ధికి గ్రాంట్, రిసోర్సెస్ గ్యాప్ పై చర్చ, ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్, పన్ను ప్రోత్సహకాలు గురించి చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జరుగబోయే సమావేశంలో సమస్యలు పరిష్కారం కావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విభజన తరువాత 24 సార్లు ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అయితే ఈ సారి మాత్రం సమస్యల పరిష్కారం కావచ్చనే అభిప్రాయం ఉంది. త్రిసభ్య కమిటీతో రెండు రాష్ట్రాల అధికారులు సమావేశం కానున్నారు.
ఏపీ, తెలంగాణ సీఎస్ లకు కేంద్రం లేఖ… విభజన సమస్యలపై 17న సమావేశం
-