హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో స్టేషన్లలోనూ జనరిక్‌ మెడికల్‌ షాపులు

-

హైదరాబాద్ వాసులకు శుభవార్త. హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ఇకనుంచి జనరిక్ మందులు అలాగే ఇతర ఫార్మా ఉత్పత్తులు లభించనున్నాయి. మెట్రో రైల్, దావా దోస్త్ తో భాగస్వామ్యం తో జెనరిక్ ఔషధాలు అలాగే ఫార్మా ఉత్పత్తులను మెట్రో స్టేషన్లలో విక్రయించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. తొలి స్టోర్ ను ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ లో హెచ్ ఎం ఆర్ ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అమీర్పేట, కే పి హెచ్ బి, హైటెక్ సిటీ అలాగే ఎంజీబీఎస్ తదితర స్టేషన్లలో దావా దోస్త్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఆయా దుకాణాల్లో 15 నుంచి 80 శాతం రాయితీ కూడా పొందవచ్చని పేర్కొన్నారు. ప్రయాణికులతో పాటు గా సందర్శకులకు ఇది సంతోషకరమైన సమాచారం అని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news