తూతూ మంత్రంగా పనులు చేసి నిధులు పంచుకుంటున్నారు : సోము వీర్రాజు

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వానికి కాల్వల్లో పూడిక కనిపించడం లేదా..? అని ఆయన ప్రశ్నించారు. పంట కాల్వల, డ్రెయిన్ల నిర్వహణ ఒక నిరంతర ప్రక్రియలా సాగాలని, గత ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వం గానీ పూడికతీత అంశాన్ని నిర్లక్ష్యం చేశాయని సోము వీర్రాజు అగ్రహం వ్యక్తం చేశారు. పొలాలనుంచి డ్రెయిన్లలో పారే నీటిలో తప్పనిసరిగా సిల్టు ఉంటుంది.. అది కాల్వల్లో పేరుకుపోతుందని, గుర్రపుడెక్క వంటి కలుపును వెంట వెంటనే తీయకపోతే విపరీతంగా వృద్ధిచెంది నీటి ప్రవాహాలను అడ్డుకుంటుందన్నారు. ఇవన్నీ ఇరిగేషన్ అధికారులకు తెలుసు, ప్రభుత్వాలకూ తెలుసు. కానీ వాటికి నిధులు కేటాయించటం వృధా అనుకుంటున్నారని ఆయన విమర్శించారు.

TDP, YSRC governments failed to develop AP, says Somu Veerraju

దానివల్ల ఓట్లు రావు.. పంచితే ఓట్లు వస్తాయన్న భావనతో పాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అందుకే రోడ్లు వేయరు, పంట కాలవలు, డ్రెయిన్లు క్లీన్ చేయరు అంటూ ఆయన ధ్వజమెత్తారు. కనీసం వేసవిలో నరేగా నిధులతో ఈ పనులు చేసేలా ఉపాధి కూలీలను ప్రోత్సహించవచ్చు.. తూతూ మంత్రంగా పనులే చేసి ఆ నిధులు పంచుకోవాలని చూస్తున్నారంటూ ఆయన విమర్శలు చేశారు. ఇంత దుర్మార్గం జరుగుతోంది కనుకనే రైతులు వరి వేయం అంటున్నారని, ప్రభుత్వం కళ్ళు తెరవాలని ఆయన హితవు పలికారు. ప్రభుత్వ పెద్ద బాధ్యతగా ఉంటే రాష్ట్రం ముందుకు వెళుతుందన్న సోము వీర్రాజు.. ఉన్న నిధులనే పొదుపుగా, సక్రమంగా, అవినీతి రహితంగా వాడితే ఈ పనులన్నిటీ నిధులు ఉంటాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news