ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ బడ్జెట్ సమావేశాలకు జగన్మోహన్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి ఏడో తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మార్చి నెలాఖరు వరకు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహిస్తారు అనేదానిపై ఇంకా క్లారిటి రాలేదు.
దాదాపు ఇరవై రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని సమాచారం అందుతోంది. మార్చ్ ఏడో తేదీన తొలి రోజు సమావేశంలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల అసెంబ్లీ సంతాపం వ్యక్తం చేయనుంది.
మార్చి 8వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు. మార్చి 11 లేదా 14 తేదీల్లో.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఈసారి రెండు లక్ష కోట్లకు పైగానే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ముఖ్యంగా రోడ్ల మరమ్మత్తులు, సంక్షేమ పథకాలపై ఎక్కువ ఫోకస్ చేయనుంది సర్కార్.