సీఎం అయ్యాక.. కర్నూల్‌లో తొలిసారి జ‌గ‌న్‌ ప‌ర్య‌ట‌న‌..!

-

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కర్నూలులో పర్యటించనున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం అయ్యాక జ‌గ‌న్ క‌ర్నూల్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే మొద‌టిసారి. నేటి ఉదయం 10 గంటలా 30 నిమిషాల నుంచి ఒంటిగంటా 30 నిమిషాలకు వరకు కర్నూల్‌లో ఉండనున్న జగన్‌ పర్యటనకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ముందుగా ఓర్వకల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కర్నూలులోని రెండవ ఏపీఎస్పీ బెటాలియన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 11 గంటలకు కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాలకు చేరుకుని డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

ప్రథమ, ద్వితీయ దశల్లో చికిత్స చేయించుకున్న విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేస్తారు. మూడో విడత కంటి వెలుగు, అవ్వ, తాతలకు కంటి పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వైయస్సార్‌ కంటి వెలుగు మూడో విడతలో 60 ఏళ్లు, ఆ పైబడిన మొత్తం 56,88,424 మంది అవ్వాతాతలకు స్క్రీనింగ్‌ (కంటి వైద్య పరీక్షలు) చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత 100 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఆరోగ్య, వికాస కేంద్రాల నమూనా భవనానికి శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు 108 కోట్లకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేస్తారు. ఇక ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news