కరోనా మహమ్మారి త్వరగా తగ్గిపోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. పోలీసు శాఖలోని అన్ని అంతర్గత డిపార్ట్మెంట్లతో డీజీపీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసులుగా అన్నిట్లో ముందుంటాం, గనుక కరోనా విషయంలో కూడా మనమే ముందు ఉండాలని ఆయన పోలీసులకు సూచించారు. రాబోయే మూడు నెలల్లో పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు.
పోలీసు శాఖలో సమగ్రత, అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. నేరం చేస్తే పోలీసులపైనా న్యాయ పరమైన చర్యలు కచ్ఛితంగా ఉంటాయి. పోలీసు సిబ్బంది మీద పోలీసులే చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం, ఆ పరిస్థితి తీసుకు రావొద్దని హకచరించారు. అలాగే ఏపీ పోలీసులకు టెక్నాలజీ స్కిల్స్‌లో పది అవార్డులు వచ్చాయని.. మొత్తం డిపార్ట్మెంట్‌కు 26 అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు.