గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. తాజాగా బుధవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ప్రణబ్ హెల్త్ కండీషన్ గురించి ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వివరించారు. ప్రణబ్ వెంటిలేటర్‌పైననే చికిత్స తీసుకుంటున్నారని, ఆయన ఇంకా డీప్ కోమాలోనే ఉన్నట్లు తెలిపారు. అయితే ప్రణబ్ శరీరంలోని కొన్ని ముఖ్యమైన అవయవాలు మాత్రం పని చేస్తున్నట్లు పేర్కొన్నారు వైద్యులు.
ప్రస్తుతం ఆయనకు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ప్రణబ్ ఆగస్టు 10న ఆస్పత్రిలో చేరగా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. అదే రోజు ఆయనకు మెదడు శస్త్రచికిత్స కూడా జరిగింది. ఇక ఆరోజు నుంచి ఆయన వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు.