కూతురు పెళ్లికి అప్లై చేస్తే మనవరాలు బారసాలకి లోన్ వస్తుంది – ఏపీ ఉద్యోగులు

-

కూతురు పెళ్లికి అప్లై చేస్తే మనవరాలు బారసాలకి లోన్ వస్తుందని అవేదన వ్యక్తం చేశారు ఏపీ ఉద్యోగులు. మంత్రుల కమిటీ తో ఉద్యోగ సంఘాలు తాజాగా సమావేశం అయ్యాయి. ఈ సందర్భంగా సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. Employees Health scheme మీద ఎక్కువ సమయం చర్చ జరిగింది.. ఆరోగ్య శ్రీ ఇతర రాష్ట్రలో కూడ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. EHS మాత్రం అనుమతించడం లేదు.. EHS కూడ ఇతర రాష్ట్రాల లో అమలు చేసే విధంగా ఉత్తర్వులు ఇస్తాము అని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.


కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసే అంశం మీద చర్చించాము .. దానికి కమిటీ నియమిస్తాం. త్వరలో పరిష్కారం చూపుతాం అని చెప్పారన్నారు. యూనివర్సిటీ కాలేజీల్లో పని చేసే వాళ్ళకి 62 ఏళ్ళకు సర్వీస్ పెంచాలని అడిగాం.. త్వరలో జీవో ఇస్తామన్నారని చెప్పారు.

బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. GPF అమౌంట్ ఈ నెల చివరి నాటికి వారి వారి అకౌంట్స్ లో వేస్తాం అని చెప్పారు… GPF లోన్ పెట్టుకుంటే ఇంత వరకు అమౌంట్ సరైన టైమ్ లో రావడం లేదని ఫైర్ అయ్యారు. కూతురు పెళ్లికి GPF పెట్టుకుంటే మనవరాలు పుట్టిన రోజుకి, బారసాలకి లోన్ వస్తుందని చురకలు అంటించారు. గ్రామవార్డు సచివాలయం ఉద్యోగులను కొంతమందిని రెగ్యురలైజ్ చేశారు, మరి కొంతమందిని చేయాల్సి ఉంది వారిని కూడా చేస్తామన్నారు… హెల్త్ డిపార్ట్మెంట్ 54 డిమెండ్‌ల మీద శుక్రవారం మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు బండి శ్రీనివాసరావు.

Read more RELATED
Recommended to you

Latest news