సీఎం జగన్‌ కు క్షమాపణలు చెప్పిన ఉద్యోగులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఉద్యోగుల తరఫున పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి.. క్షమాపణలు చెప్పారు. ఉద్యోగుల పోరాటం వృథా కాలేదని… ఫిట్ మెంట్ తప్ప మిగిలిన డిమాండ్లు మాకు సానుకూలంగా నే ప్రభుత్వం స్పందించిందన్నారు. పదేళ్ల పీఆర్సీ బదులు ఐదేళ్ల పీఆర్సీని మేము సాధించుకున్నామని..హెచ్ ఆర్ ఎ శ్లాబుల్లో తెలంగాణ తో సమానంగా సాధించుకున్నామని స్పష్టం చేశారు.

*మా నుంచి 5400 కోట్లు రికవరీని ప్రభుత్వం ఆపేసిందన్నారు. *నిన్నటి చర్చల్లో ఏడాదికి 1500 కోట్లు అదనంగా ప్రభుత్వం నుంచి రాబట్టామని వెల్లడించారు.సీఎంది చాలా పెద్ద చేయి..మేము ఏదైనా అడిగితే ఏదీ కాదనరని..మేము ఆవేశంలో మాట్లాడినందుకు సీఎంకు క్షమాపణలు చెబుతున్నామని పేర్కొన్నారు.ఇలాంటి పరిస్ధితుల్లో ఇరువర్గాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలి..ఉద్యోగులు అర్ధం చేసుకోవాలన్నారు వెంకట్రామిరెడ్డి.మొత్తం ఎపిసోడ్ లో ఉద్యోగులు విజయం సాధించారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news