ద‌ళిత బాలిక‌పై గ్యాంగ్ రేప్‌, హ‌త్య‌.. ఆ త‌రువాత‌ పోలీసుల‌పై కాల్పులు..!

-

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని గోండా జిల్లాలో అత్యంత దారుణ‌మైన వెలుగులోకి వ‌చ్చింది. ద‌ళిత బాలిక‌పై ఇద్ద‌రు దుండ‌గులు అత్యాచారానికి పాల్ప‌డి ఆ త‌రువాత హ‌త్య చేసారు. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. న‌వాబ్ గంజ్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఆ బాలిక మృత‌దేహాన్ని శ‌నివారం పంట పొలాల్లో క‌నుగొన్నారు స్థానికులు. శ‌రీరంపై గాట్లు, తీవ్ర గాయాల‌ను గుర్తించారు. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

గ్రామం స‌మీపంలోని ఓ చెరుకు తోట‌లో నిందితులు త‌ల‌దాచుకున్న‌ట్టు తెలుసుకుని చుట్టుముట్టారు పోలీసులు. ఈ త‌రుణంలో వారి నుంచి త‌ప్పించుకునేందుకు నిందితులు కాల్పులు జ‌రిపారు. పోలీసులు ఎదురు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఓ నిందితునికి తూటాలు త‌గిలాయి. తీవ్రంగా గాయ‌ప‌డిన నిందితుడు మ‌హేష్ యాద‌వ్‌ను అదుపులోకి తీస‌కున్నారు పోలీసులు. మ‌రొక నిందితుడు ప‌రారైన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news