ఏపీలో ఈ పాసులు ఉంటే లాక్‌డౌన్‌లోనూ ప్రయాణం చేయొచ్చు..!!

-

క‌రోనా వైర‌స్‌(కోవిడ్-19).. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ప్ర‌జ‌ల్లో ఇదే భ‌యం నెల‌కొంది. ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు.. ఎటునుంచి.. ఎవ‌రిని కాటేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. చైనాలో పుట్టుని ఈ వైర‌స్ ఇప్ప‌టికే 200 దేశాల‌కుపైగా వ్యాపించి ప్ర‌జ‌ల‌ను శాసిస్తుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎంతంటి ధ‌న‌వంతుడైనా.. బ‌ల‌వంతుడైనా క‌రోనా ముందు త‌ల దించాల్సి వ‌స్తుంది. ఇక ఈ మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. అంద‌రికీ నివార‌ణ ఒక్క‌టే మార్గంగా క‌నిపిస్తుంది. దీంతో ఇప్ప‌టికే ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించ‌డంతో పాటు క‌ఠ‌న చ‌ర్య‌లు కూడా చేప‌ట్టాయి.

ఇందుకు భార‌త్ కూడా మిన‌హాయింపు కాదు. భార‌త్‌లో సైతం క్రేందం 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది. దీంతో అత్యవసర ప్రయాణాలు చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ బాధల‌కు చెక్ పెట్టేందుకు ఏపీ పోలీసులు గుడ్ న్యూస్ అందించారు. అదేంటంటే.. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన ప‌రిస్థితుల్లో వారికి స్పెష‌ల్ పాస్‌లు జారీ చేస్తున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్ వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే వాహ‌నాల‌ పాస్‌ల మంజూరు కోసం మొత్తం 13 జిల్లాల పోలీస్ శాఖ వాట్సప్ నెంబర్లు, ఈ మెయిల్ వివరాలను అందుబాటులో పెట్టారు.

ఇక ఈ పాసులు పొందాలంటే ముందుగా మ‌న పూర్తి వివ‌రాలు, ఆధార్‌ కార్డు వివరాలు, ప్రయాణించే వాహనం నంబర్ లాంటి వివరాలు ఆయా జిల్లా పోలీస్ అధికారులకు వివరిస్తే.. వెంట‌నే సంబంధిత వ్యక్తికి మొబైల్‌ నెంబర్‌కు వాట్సాప్ ద్వారా లేదా మెయిల్‌ ఐడీకి పాస్‌ను జారీ చేస్తార‌ని వివ‌రించారు. మ‌రో విష‌యం ఏంటంటే.. జిల్లా ఎస్పీ వాట్సాప్‌ నెంబర్‌ లేదా మెయిల్‌ ఐడీ నుంచి వచ్చిన పాస్‌లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఫార్వార్డ్‌ చేసిన పాస్‌లు ఏ మాత్రం ప‌ని చేయ‌వ‌ని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఒకరి పేరుతో తీసుకుని మరొకరికి పంపినా, ఇతరుల పేరుతో ఎవరైనా అప్లై చేసినా క‌ఠ‌న చర్యలు తప్పవని వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news