ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎడ్యుకేషన్ టెక్ కంపెనీతో డీల్!

-

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో కీలక మార్పుకు వైసీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రపంచంతో పోటీపడే విధంగా.. విద్యార్థులకు అధునాతన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రముఖ ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ ‘బైజూస్’ సంస్థతో ఒప్పందం చేసుకుంది. సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్.సురేశ్ కుమార్, బైజూస్ వైస్ ప్రెసిడెంట్ సుస్మిత్ సర్కార్ గురువారం సంతకాలు చేశారు. వర్చువల్ పద్ధతిలో బైజూన్ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్ అమెరికా నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సీఎం జగన్-ఎడ్యుకేషన్
సీఎం జగన్-ఎడ్యుకేషన్

కాగా, ఇటీవల సీఎం జగన్ దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పలు యూనికార్న్ స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు, సీఈఓలతో సమావేశమయ్యారు. అప్పుడే బైజూస్ సీఈఓ రవీంద్రన్‌తో భేటీ అయ్యారు. ఈ-లెర్నింగ్ కార్యక్రమాలపై చర్చించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రవీంద్రన్ తెలిపారు. కాగా, బైజూస్‌తో ఒప్పందం పేద పిల్లల జీవితాలను మారుస్తుందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.500 కోట్లతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు త్వరలో ట్యాబ్‌లు ఇస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news