ఇంటర్ ఫలితాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫైనల్ ఇయర్ మార్కులలో అసెస్‌మెంట్ విధానం అమలు చేయనుంది సర్కార్. ఈ విధానం ప్రకారం… టెన్త్‌లో టాప్ 3 సబ్జెక్టులకు వచ్చిన మార్కుల ఆధారంగా 30 శాతం మార్కులు ఇవ్వనుంది. అలాగే… ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో సబ్జెక్టు వైజ్ మార్కులకు 70 శాతం మార్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పూర్తైనందున వాటి ఫలితాల ఆధారంగా మార్కులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నెలాఖరు లోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామని ప్రకటించింది సర్కార్.
ఇది ఇలా ఉండగా.. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్..నూతన విద్యా విధానం ప్రతిపాదనలను ఈ వారంలో ఖరారు చేయాలన్నారు. నాడు – నేడు పనులను యాథవిధిగా కొనసాగించాలని… షెడ్యూలు ప్రకారం పనులు పూర్తికావాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా టీచర్లు ఉండాలని.. ఒక్క స్కూలునూ మూసేయకూడదు., ఒక్క టీచర్‌నూ తొలగించకూడదని సీఎం ఆదేశించారు.