ఏపీలో ఆక్సిజన్ కొరత విషయంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ ఎంత..? ఏ మేరకు సరఫరా ఉందనే అంశంపై కసరత్తులు చేస్తోంది. రాష్ట్రానికి పీక్ స్టేజీలో ఏ మేరకు ఆక్సిజన్ అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. పీక్ స్టేజీలో సుమారు 200 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 80 నుంచి 100 టన్నుల ఆక్సిజన్ అవసరమంటున్నారు అధికారులు. ఏపీకి నాలుగు ప్రాంతాల నుంచి ఆక్సిజన్ తెచ్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్, భువనేశ్వర్, బళ్లారి, చెన్నై నుంచి ఆక్సిజన్ తెచ్చుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు అధికారులు. విశాఖ నుంచి 80 టన్నుల, భువనేశ్వర్ నుంచి 70 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసేందుకు అంగీకరించాయని అంటున్నారు అధికారులు. ఇప్పటికే ఆక్సిజన్ సరఫరా ప్రారంభించిన విశాఖ స్టీల్ ప్లాంట్, బళ్లారి, చెన్నైల నుంచి కూడా మరింత ఆక్సిజన్ తెచ్చుకునేలా అధికారుల కసరత్తులు చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ఆక్సిజన్ నిల్వలను సిద్ధం చేసుకునే ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు అధికారులు.