బందర్‌ పోర్ట్‌ నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

-

ఈ రోజు జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది..దాదాపుగా మూడు గంటలకుపైగా జరిగిన ఈ భేటీలో బందురు పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్..మంత్రి వర్గం నుంచి అనుమతి లభించడంతో పోర్టు నిర్మాణంపై ఏపీ మారీటైమ్‌ బోర్డు ఫోకస్ పెట్టింది..వీలైనంత త్వరగా పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించే దిశగా కసరత్తు ప్రారంభించింది..పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించిన మూడేళ్ల కాలంలో తొలి దశ పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది మారీటైమ్..తొలి దశలో ఆరు బెర్తులతో బందరు పోర్ట్‌ నిర్మాణం ఉంటుంది.పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములకు సంబంధించిన లెక్కలు సిద్దం చేస్తోంది మారీటైమ్..తొలి దశ పోర్టు నిర్మాణానికి సుమారు వేయి ఎకరాలు అవసరమని అంచనా వేసింది..సముద్రంలో సుమారు 155ఎకరాల్లో డ్రెడ్జింగ్‌ పనులు ఉంటాయని అంచన వేస్తుంది.. నాలుగు జనరల్‌ కార్గో బెర్తులు, ఒక్కో కోల్‌ బెర్త్‌, కంటైనర్‌ బెర్తుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తోంది. 80వేల డెడ్‌ వెయిట్‌ టన్నేజ్‌ కెపాసిటీ గల షిప్పులు వచ్చేందుకు అనువుగా బెర్తుల నిర్మాణం చేస్తారు.. పోర్టులో గోడౌన్లు, అంతర్గత రోడ్లు, ఇంటర్నల్‌ రైల్‌ యార్డ్‌, సబ్ స్టేషన్‌, పరిపాలనా భవనం వంటి నిర్మాణాల పైనా ఫోకస్‌ పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news