తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కొద్ది సేపటి కృతం స్టార్ హీరో విజయ్ పార్టీ పెడుతున్నట్టు ప్రచారం జరగగా అసలు తన తండ్రి రిజిస్టర్ చేసిన పార్టీతో సంబంధం లేదని చెప్పారు హీరో విజయ్. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కూడా తండ్రి పార్టీతో సంబంధం లేదని విజయ్ తేల్చి చెప్పాడు. తన అభిమానులు నా తండ్రి పార్టీతో కలిసి పనిచేయరని హీరో విజయ్ పేర్కోన్నాడు. అంతే కాదు తన ఫొటో, పేరు ఉపయోగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించాడు.
విజయ్ పేరుతో పార్టీ రిజిస్టేషన్ కోసం తండ్రి చంద్ర శేఖర్ దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. అయితే తండ్రి అంటే కొడుకు కోసమే పెట్టి ఉంటాడని అందరూ భావించారు. ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కళ్ ఇయక్కం పేరుతో పార్టీ పెట్టడంతో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారంటూ తమిళనాట తీవ్ర దుమారం రేపింది. విజయ్ పార్టీ పెట్టాడనే వార్తలతో తమిళ రాజకీయ పార్టీలు ఉలిక్కిపడ్డాయి. కానీ అదంతా తనకు సంబంధం లేని వ్యవహారం అని తేల్చేయడంతో వాటికి టెన్షన్ తప్పింది.