ఏపీ గ‌వ‌ర్న‌ర్ ఒక బ్రోక‌ర్ : సీపీఐ నారాయ‌ణ వివాదాస్ప‌ద‌ వ్యాఖ్య‌లు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూషన్ హ‌రి చంద‌న్ పై సీపీఐ నారాయ‌ణ వివాదాస్ప‌ద‌ వ్యాఖ్య‌లు చేశారు. అలాగే మొత్తం గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ ప‌నే సీపీఐ నారాయ‌ణ సంచల‌న కామెంట్స్ చేశారు. కాగ ఏపీ గ‌వ‌ర్నర్ భిశ్వ భూషన్.. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య ఒక బ్రోక‌ర్ లా ప‌ని చేస్తున్నాడ‌ని ఆరోపించారు. అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూషన్.. హెడ్ క్ల‌ర్క్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఘాటు అయినా వ్యాఖ్య‌లు చేశారు.

అంతే కాకుండా గ‌వ‌ర్న‌ర్ పాత్ర పై అస‌హ్య‌క‌ర‌మైన అనుమానాలు ఉన్నాయని అన్నారు. వ‌య‌స్సు రిత్యా పెద్ద వాడు అయినా.. కార్య‌క్ర‌మాలు చిల్ల‌ర గా ఉన్నాయంటు ఘాటుగా స్పందించారు. రాజ‌కీయ అనుభ‌వం ఉన్నవాడు కాబ‌ట్టి.. పాల‌న బాగుంటుంద‌ని అనుకున్నాని అన్నారు. కానీ ఏపీ సీఎం జ‌గ‌న్ ఎలా చెబితే అలా వింటున్నాడ‌ని అన్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్ కు గ‌వ‌ర్నర్ హెడ్ క్ల‌ర్క్ గా ఉంటున్నాడ‌ని ఆరోపించారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌నే తీసివేయాల‌ని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version