కరోనా వ్యాక్సిన్ మన దేశానికి ఎప్పుడు దొరికినా సరే దాన్ని ప్రజలకు అందించే విషయంలో ఇప్పుడు కేంద్రం సిద్దంగా ఉంటుంది. జర్మనీ తయారు చేసిన ఫైజర్ కరోనా వ్యాక్సిన్ ని గనుక భారత్ దక్కించుకుంటే… దాన్ని నిల్వ చేసే విషయం మీద కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. వ్యాక్సిన్ ని ఎలా నిల్వ చేయాలనే దానిపై కేంద్రం అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
ఫైజర్ వ్యాక్సిన్ ని మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఏ దేశానికైనా పెద్ద సవాలుగా ఉంటుంది. మంగళవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ విలేకరుల సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్య) డాక్టర్ వికె పాల్ మాట్లాడుతూ కోవిడ్ -19 వ్యాక్సిన్ పంపిణీపై జాతీయ పథకం తుది దశలో ఉందని చెప్పారు. ఆయన కోవిడ్ -19 పై జాతీయ టాస్క్‌ఫోర్స్ కు చీఫ్ గా ఉన్నారు. భారత జనాభాకు అవసరమైనంత వరకు వ్యాక్సిన్ అందుబాటులో ఉండదన్నారు.