రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం !

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సీఎం అయ్యాక సంక్షేమమే పరమావధిగా తన పాలన కొనసాగిస్తున్నాడు. పేదలందరికీ అవసరమైన అన్ని అవసరాలను పథకాల్లో సమకూర్చి నేరుగా వారికే అందేలా చర్యలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా రైతుల కోసం అనేక రకాల పథకాలను అమలులోకి తీసుకువచ్చాడు. తాజాగా రైతులకు ఒక శుభవార్తను ఏపీ ప్రభుత్వం అందించింది. రభీ సీజన్ లో తీసిన వరి పంటను కొనుగోలు చేయడానికి తగిన ఏర్పాట్లను చేస్తోంది. ఈ విషయం గురించి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మరో వారంలో ధాన్య సేకరణ ప్రారంభం అవుతుందని తెలిపాడు. ఈ ధాన్యాన్ని సేకరించడానికి అవసరం అయిన గోతాలను మిల్లర్ లకు అందిస్తామని చెప్పారు.

గత ఖరీఫ్ సీజన్ లో రైతులు ఎదుర్కొన్న సమస్య మళ్లీ పునరావృతం కాకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాటిచ్చారు. ఏ రైతు కూడా ధాన్యానికి సరైన మద్దతు ధర రాలేదు అన్న సమస్య లేకుండా చేస్తామన్నారు. ఇందులో ఎవరి జోక్యాన్ని మేము సహించబోమని గట్టిగా చెప్పారు.