కొత్త ఎక్సైజ్ పాలసీలో ఆ ఊసే తీయని ఏపీ సర్కార్ !

-

నిన్న ఏపీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానున్నది. ఏపీలో ప్రస్తుతమున్న 2,934 మద్యం దుకాణాలు మరో ఏడాది పొడిగించారు. అయితే మద్యం దుకాణాల తగ్గింపుపై కొత్త పాలసీలో ఎక్కడా ప్రభుత్వం ప్రస్తావించలేదు. నిజానికి మద్య నిషేధం అమలులో భాగంగా ప్రతి ఏడాది 20 శాతం మేర మద్యం దుకాణాలు తగ్గించాలని గతంలో నిర్ణయం తీసుకుంది.

అయితే లాక్‌డౌన్ తర్వాత 13 శాతం మద్యం దుకాణాలు తగ్గించినందుకు ప్రస్తుత పాలసీలో తగ్గింపు ప్రస్తావన లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి, ఇక తిరుపతి రైల్వేస్టేషన్-అలిపిరి మార్గంలో లిక్కర్ షాపులకు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, లీలామహల్ సెంటర్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాసం వంటి ప్రాంతాల్లో లిక్కర్ అమ్మకాలపై నిషేధం విధించారు. ఇక ఎక్సైజ్‌శాఖ కమిషనర్ అనుమతితో లిక్కర్ మాల్స్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం తాను నిర్దేశించిన 2,934 దుకాణాల పరిధికి లోబడే లిక్కర్‌ మాల్స్ ఏర్పాటు చేయాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news