డీజీపీకి బాబు లేఖ.. మనోభావాలు దెబ్బతీసేలా ఉందన్న ఏపీ పోలీసులు !

-

చంద్రబాబు లేఖలు, పోలీసు ల పై ఎన్సీఆర్బీ నివేదిక తదితర అంశాల మీద ఏపీ పోలీసులు స్పందించారు. డీఐజీ పాలరాజు మాట్లాడుతూ కరోన సమయంలో పోలీసులు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నారని, అనేక మంది పోలీసులు అమరులయ్యారని అన్నారు. ఇలాంటి కష్ట కాలంలో డీజీపీ కి చంద్రబాబు లేఖ రాశారన్న ఆయన చంద్రబాబు లేఖలో విషయాలు సత్య దూరంగా ఉన్నాయి…మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. ఈ లేఖ పోలీసులకి మనోవేదనకు గురిచేసిందని అన్నారు. ఎన్సీఆర్బీ గణాంకాలు లో పొరపాట్లు నమోదు అయ్యాయన్న ఆయన ఇలాంటి పొరపాట్లుని దాదాపుగా అందరూ గుర్తించారని అన్నారు.

అలాంటిది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించలేదు, విజ్ఞత తో ఆలోచించాల్సిందని అన్నారు. పోలీసులు అప్రమత్తత ని కూడా చంద్రబాబు గుర్తించాన్న ఆయన ఎన్ సీ అర్బీ డేటాలో దొర్లిన తప్పులపై వివరణ ఇచ్చారు. చిత్తూరు, విశాఖ అర్బన్, విశాఖ రూరల్ లలో డేటాలో తప్పులున్నయన్న ఆయన 2016లో 100, 2017లో 164 కేసులు, 2018లో 97, 2019లో 111 మాత్రమే అయినప్పటికీ తప్పుగా మొత్తం 1638 కేసులుగా డేటాలో నమోదయ్యాయని అన్నారు. టీడీపీ నేత పట్టాభి కారు పై దాడి ఘటన లో ఆయన ఇంట్లో సీసీ కెమెరాలు కూడా పని చేయలేదన్న అయన దీనిపై కూడా దర్యాప్తు చేస్తామని అన్నారు. దాడి విషయంలో అసలు వాస్తవాలు వెలికి తీసి,నిందితులను పట్టుకుంటామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news