తెలంగాణా ని చూసి ఐనా ఏపీ లో మొదలెట్టాలి లేదంటే కష్టం..!!

-

కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చనిపోతున్నారు. మందులేని ఈ వైరస్ మనుషుల నుండి మనుషులకు సోకుతున్న తరుణంలో ప్రపంచ దేశాలు ప్రజలను ఇళ్లకే పరిమితం చేశాయి. చాలా వరకు ప్రపంచంలో ఉన్న దేశాలు వైరస్ ని ఎదుర్కొనడానికి లాక్ డౌన్ విధించాయి. అయితే ఈ వైరస్ వల్ల చనిపోయిన వాళ్ళల్లో ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆదేశాల ప్రకారం శవాన్ని చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి  డిస్ మాటిల్ చేయాలి ఆదేశాలు ఇచ్చింది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వైరస్ వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. అయితే వైరస్ వల్ల మరణించిన వాళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంప్రదాయాలను గౌరవిస్తూ కరోనా వైరస్ వల్ల చనిపోయిన వారి విషయంలో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. హిందూ ముస్లిం క్రైస్తవ మత ఆచారాల ప్రకారం గ్రేస్ వల్ల చనిపోయిన వారిని ఖననం చేయటానికి కమిటీ ఏర్పాటు చేసింది. తాజాగా తెలంగాణ సర్కార్ విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే. महाराष्ट्र में कोरोना वायरस के ...*తెలంగాణ సర్కారు విడుదల చేసిన మార్గదర్శకాలివీ..

*కరోనాతో మరణిస్తే ఆసుపత్రి వాహనాల్లో నియమించిన వ్యక్తులతో మృతదేహాలను ప్యాకింగ్ చేస్తారు. శ్మశానవాటికకు తరలిస్తారు.

*కేవలం ఐదుగురు కుటుంబ సభ్యులకు మాత్రమే ఖననం వేళ అనుమతి ఉంటుంది.

*మృతదేహాల ఖననాన్ని వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వమే పకడ్బందీగా నిర్వహిస్తుంది.

*హిందూ కరోనా మృతదేహాలను దహనం చేస్తారు.

*ముస్లిం క్రైస్తవ మృతదేహాలను వారి మత ఆచారం ప్రకారం ఖననం చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరణాలు సంభవిస్తున్న తరుణములో అన్ని మతాలను గౌరవించాలని, తెలంగాణ ని చూసి ఏపీలో కూడా అదే రీతిగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. వైరస్ వల్ల చనిపోతున్న వ్యక్తులను చివరి చూపు కుటుంబాలు చూసుకోలేక పోతున్నాయని, ఇలా అయితే ఆ ఆవేదన కుటుంబ సభ్యులకు తీరని లోటుగా ఉంటుందని కష్టంగా ఉంటుందని ఖననం విషయంలో అన్ని సంప్రదాయాలను గౌరవిస్తూ తెలంగాణ ని ఏపీ అనుసరించాలని కోరుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news