తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రానికి ఏపీ టీడీపీ ఫిర్యాదు !

-

ఇవాళ ఏపీ టిడిపి నేతలు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని ప్రకాశం, నెల్లూరు జిల్లాల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యలు, మాజీ శాసనసభ్యలు కలిశారు. వెలుగొండ ప్రాజెక్టు అంశంపై కేంద్ర మంత్రిని టిడిపి నేతల బృందం కలిసింది. వెలుగొండ ప్రాజెక్టును తక్షణమే అనుమతి పొందిన ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్పించాలని కేంద్ర మంత్రిని ప్రకాశం, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల బృందం కోరింది.

ప్రకాశం జిల్లా కరువు పరిస్థతిని, జిల్లా నైసర్గిక స్వరూపాన్ని, వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను సవివరంగా కేంద్రమంత్రికి వివరించింది తెదేపా బృందం. అంతేకాదు తెలంగాణ సర్కార్ వ్యవహారం పై కూడా కేంద్ర మంత్రికి టిడిపి నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అద్దంకి శాసనభ్యలు గొట్టిపాటి రవికుమార్, కొండపి శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, తదితరులు కేంద్రమంత్రిని కలిసిన బృందంలో ఉన్నారు. కాగా మూడు రోజుల క్రితం వెలుగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవని.. కృష్ణా బోర్డ్ కు తెలంగాణ సర్కార్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news