ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం మరియు దాని దగ్గరగా ఉన్న తమిళనాడు తీరము మరియుశ్రీలంక తీరానికి పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనంనకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 km ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతున్నది. రాగల ౩-4 రోజులలో ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.
తూర్పు గాలులోఏర్పడిన ఉపరితల ద్రోణి పైన పేర్కొనబడిన ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర కోస్తా ఆంధ్ర వరకు సగటు సముద్రమట్టానికి 1.5 km ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతున్నది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనే మూడు రోజుల పాటు ఎక్కువగా వర్షాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రము పేర్కొంది.