రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్వహించదలచిన అపెక్స్ కమిటీ భేటీ వాయిదా పడింది. ఈ నెల 25 న జరగాల్సి ఉన్న ఈ భేటీని వాయిదా వేస్తున్నట్టు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కరోనా బారిన పడ్డారు. అందుకే ఈ భేటీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల జలవనరుల శాఖలకు ఇప్పటికే సమాచారం కూడా ఇచ్చింది. కృష్ణా నదీ జలాలకు సంబంధించి రాయలసీమకు నీళ్ళు తీసుకెళ్ళే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని పోతిరెడ్డి పాడు వద్ద నిర్మిస్తున్నామని ఏపీ సర్కార్ జీవో జారీ చేయడం తెలిసిన విషయమే.