భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని భారత క్రికెట్ కంట్రోల్ నియంత్రణ మండలి అవమానించింది అని, ధోనీ క్రికెట్ కి వీడ్కోలు అలా పలకడం కరెక్ట్ కాదని పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ అన్నాడు. బిసిసిఐ ఎం ఎస్ ధోని విషయంలో సరైన రీతిలో ప్రవర్తించలేదని , పదవీ విరమణ అనేది సరైన వీడ్కోలు లేకుండా జరగకూడదని అన్నారడు. లక్షలాది మంది అభిమానులు చివరి సారిగా అతన్ని భారత జెర్సీలో చూడాలని కోరుకుంటున్నారని సక్లైన్ అన్నాడు.
“నేను ఎల్లప్పుడూ సానుకూల విషయాలు చెబుతాను మరియు ప్రతికూలతను ఏ విధంగానూ వ్యాప్తి చేయకుండా ప్రయత్నిస్తాను కాని నేను ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఇది బిసిసిఐ ఓటమి. అతనిలాంటి పెద్ద ఆటగాడిని వారు సరైన రీతిలో చూడలేదు. పదవీ విరమణ ఇలా జరగకూడదు. ఇది నన్ను బాధ పెడుతుంది. నేను ఈ విషయం చెప్తున్నందుకు క్షమించండి, ధోనీని ఏ మాత్రం గౌరవించలేదని పేర్కొన్నాడు.