వర్మ శిష్యురాలు అప్సర ఐటమ్ బాంబ్ తో బ్లాస్ట్ చేస్తోంది..!!

-

రామ్ గోపాల్ వర్మ గురించి ఎవరికి ప్రత్యేకం గా పరిచయం అక్కరలేదనుకుంటా! ఎందుకంటే మనోడు వేలు పెట్టని విషయం వుండదు. గరికపాటిని గడ్డి పోచ ఆన్నా, రాజకీయ నాయకులను ఆడుకున్నా అతనికే చెల్లుతుంది. ఈయన సొంతంగా జల్సా చేస్తూ కొంత మంది శిస్యురాళ్లను వెంటేసుకుని తిరుగుతూ వుంటాడు. వర్మ ప్రధాన శిష్యురాలుగా అప్సర రాణి ముందు వరసలో వుంటుంది.ఆమె చేసే ఫోటో సూట్స్, వీడియోస్ అన్ని కుర్రాళ్లను పిచ్చ్చెక్కిస్తాయి. ఇక రాము కూడా  శిస్యురాళ్ల తో మందేస్తూ చిందేస్తూ సరసాలు ఆడుతూ వుంటాడు.

ప్రస్తుతం అప్సర రాణి కొత్త ఐటమ్ సాంగ్ యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది.సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘హంట్’ సినిమా లో ఈ సాంగ్ ఉండబోతోంది. ఈ సినిమా కు మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ‘పటాకా సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అంటూ విడుదల చేసిన పాటలో సుధీర్ , అప్సర ‘పాపతో పైలం అంటూ డాన్స్ ఇరగదీశారు .

అప్సర రాణి ఇంతకు ముందు ‘క్రాక్’, ‘సీటీమార్’ సినిమాలలో ప్రత్యేక గీతంలో  డాన్స్ చేసింది. ఈ పాటలో  సుధీర్ బాబు, అప్సరా రాణితో పాటు శ్రీకాంత్, భరత్ కూడా డ్యాన్స్ చేశారు. ఈ పాటకు యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. జిబ్రాన్ సంగీతం అందించగా. మంగ్లీ, ‘పుష్ప’ ఫేమ్  నకాష్ అజీజ్ పాడారు. విడుదలైన గంటకే ఈ పాట వైరల్ అయ్యింది. విజువల్స్ చూస్తే సూపర్ గా వున్నాయి. మీరు కూడా ఒక సారి చూసి ఆనందం పొందేయండి.

Read more RELATED
Recommended to you

Latest news