రాజగోపాల్‌ రెడ్డి ఆయన ఓటు ఆయనే వేసుకోలేడు : రేవంత్‌ రెడ్డి

-

నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం దామెరలో ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొప్పోళ్ళమని చెప్పుకునే నాయకులు 2009కి ముందు వాళ్ళు ఎవరో కూడా ప్రజలకు తెలియదన్నారు. 22 వేల మెజార్టీతో గెలిచి 22 వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయిండంటూ ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ను ఖతం చేయాలని బొడ్డులో కత్తి పెట్టుకుని తిరుగుతున్న నేతలను ఎమ్మెల్యే, ఎంపీ పదవులను ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ ఓటు అడుగుతున్న రాజగోపాల్ రెడ్డి ఆయన ఓటే ఆయన వేసుకొలేడని, ఇక్కడ ఓటు లేని రాజగోపాల్ రెడ్డి ప్రజలను ఓటు అడుగుతుండు అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

Telangana Congress leader Revanth Reddy taken into custody ahead of TRS meet

అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి అభివృద్ధికి నాంది పలకాలి. మునుగోడు ప్రజలందరినీ రాజగోపాల్ రెడ్డి నాకే ఓటు ఏమైనా అడుగుతున్నారు. మునుగోడులో ఆయన ఓటే ఆయన వేసుకోలేరు. మునుగోడు ప్రజలంతా ఆయనకెందుకు ఓటు వేయాలి. ఆయనకి ఇక్కడ ఊరు లేదు.. ఓటు లేదు మునుగోడు లో కాంగ్రెస్ ని గెలిపించండి.2023 లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మునుగోడు నియోజకవర్గాన్ని నేనే దత్తత తీసుకుంటా. సోనియా గాంధీ రాహుల్ గాంధీలను మునుగోడుకు తీసుకువస్తా. డిండి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఐదు వేల కోట్ల నిధులు ఇప్పిస్తా. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత’ అని ఆయన వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news