Arabic Kuthu : బాలీవుడ్ స్టార్ హీరోతో ”అర‌బిక్ కుత్తు” స్టెప్పులు వేసిన ర‌ష్మిక.. వీడియో వైర‌ల్

-

త‌మిళ స్టార్ హీరో విజ‌య్, బ్యూటీఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే క‌లిసి బీస్ట్ సినిమా కోసం చేసిన‌ అర‌బిక్ కుత్తు అనే పాట ఎన్నో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఈ పాటలో హీరో విజ‌య్, హీరోయిన్ పూజా హెగ్డే వేసిన స్టెప్పులు యావ‌త్ సినీ ప్ర‌పంచాన్నే ఊపేస్తున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో అభిమానులు, సెల‌బ్రెటీలు అని తేడా లేకుండా.. ఎక్క‌డా చూసినా.. ఇదే సాంగ్ వినిపిస్తుంది. ఇక హీరోయిన్స్ అయితే ఏకంగా ఈ పాట‌కు డాన్స్ లు చేసి.. ఆ వీడియోల‌ను సోషల్ మీడియాలో త‌మ అభిమానుల‌తో పంచుకుంటున్నారు.

దీంతో ఈ పాట సినీ అభిమానుల‌నే కాకుండా.. స్టార్ హీరో, హీరోయిన్స్ ల‌ను సైతం ఆక‌ట్టుకుంటుంది. ఇప్ప‌టికే ఈ పాటపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత స్టెప్పులు వేసి ఆక‌ట్టుకుంది. తాజా గా నేషన‌ల్ క్ర‌ష్ గా పేరు ఉన్న ర‌ష్మిక మంద‌న్న కూడా ఈ స్టెప్పులు వేసింది. అయితే ఈ స్టెప్పులు ర‌ష్మికనే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరో వ‌రుణ్ దావ‌న్ తో కూడా అర‌బిక్ కుత్తు స్టెప్పులు వేచింది.

కాగ అర‌బిక్ కుత్తు పై వ‌రుణ్ దావ‌న్, ర‌ష్మిక మంద‌న్న చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. కాగ నేషన‌ల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న, వ‌రుణ్ దావ‌న్ క‌లిసి ఒక సినిమా చేస్తున్నారు. కాగ ఈ సినిమా షూటింగ్ మధ్య‌లో అర‌బిక్ కుత్తు సాంగ్ కు స్టెప్పులు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news