పంజాబ్‌లో బీజేపీకి ఘోర ఓట‌మి.. 2 సీట్ల‌కే ప‌రిమితం

-

దేశ వ్యాప్తంగా బీజేపీ హవా న‌డుస్తుంది. తాజా గా ఈ రోజు వెలువ‌డిన‌ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీజీపీ దుమ్ము లేపింది. ఉత్త‌ర ప్ర‌దేశ్, గోవా, ఉత్త‌రాఖండ్, మ‌ణిపూర్ ల‌లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ కొట్టి అధికారాన్ని చేబ‌ట్ట‌బోతుంది. దీంతో దేశ వ్యాప్తంగా బీజేపీ కార్య‌క‌ర్త‌లు సంబురాల్లో మునిగి తెలుతున్నారు. దేశం మొత్తం కాషాయం జోరు న‌డుస్తున్నా.. పంజాబ్ లో మాత్రం బీజేపీకి ఘోర ఓట‌మి త‌ప్ప‌లేదు. పంజాబ్ రాష్ట్రంలో బీజేపీ కేవ‌లం రెండు సీట్ల‌కే ప‌రిమితం అయింది.

పంజాబ్ ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రెండు సార్లు వ‌చ్చి ప్ర‌చారం చేసినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు. అలాగే బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం కూడా పంజాబ్ లో ఎన్ని వ్యూహాలు ర‌చించినా.. పంజాబ్ ఓట‌ర్లు.. బీజేపీ దారుణంగా తిర‌స్క‌రించారు. పంజాబ్ లో బీజేపీకి ముఖ్యంగా రైతుల వ్య‌తిరేక‌త తాకింది. సాగు చట్టాల‌ను వెన‌క్కి తీసుకున్నా.. బీజేపీకి ఒక్క శాతం కూడా లాభం జ‌ర‌గ‌లేదు. ప్ర‌ధానితో పాటు బీజేపీ అధిష్టానం మొత్తం దిగివ‌చ్చి ప్ర‌చారం చేసినా.. కేవ‌లం 6.6 శాతం ఓట్లు మాత్ర‌మే బీజేపీకి వ‌చ్చాయి.

కాగ సాగు చ‌ట్టాల ర‌ద్దు ఉద్యోమంలో రైతుల అండ‌గా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీకి కూడా రైతులు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ కు కేవ‌లం 22.97 శాతం ఓట్లు వేశారు. కాగ పంజాబ్ ప్ర‌జ‌లు మొద‌టి సారి ఆమ్ ఆద్మీ పార్టీని ఆద‌రించారు. ఆప్ కు ఈ ఎన్నిక‌ల్లో 42 శాతం ఓట్లు వ‌చ్చాయి. దీంతో ఆప్ పంజాబ్ లో తొలి సారి అధికారం చేప‌ట్టబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news