హైదరాబాద్ వాసులకు శుభవార్త..ఇవాళ ఆరాంఘర్ – జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2021 డిసెంబర్ లో ప్రారంభమై 2024 డిసెంబర్ లో ఫ్లై ఓవర్ పనులు పూర్తయ్యాయి. 799 కోట్ల వ్యయం తో నిర్మించారు ఈ ఫ్లై ఓవర్. తెలంగాణ ఏర్పడ్డాక నిర్మించిన అతి పెద్ద ఫ్లై ఓవర్ గా గుర్తింపు పొందింది ఆరాంఘర్ – జూ పార్క్ ఫ్లైఓవర్.
ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన పీవీ ఎస్ప్రేస్ తో పోల్చితే.. హైదరాబాద్ లో రెండవ అతిపెద్ద ఫ్లై ఓవర్ ఇదే కావడం విశేషం. 4.08 కిలో మీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పు తో మొదటి సారి నిర్మించిన 6 లైన్ల ఫ్లై ఓవర్ ఉంటుంది. ఆరాంఘర్ – జూ పార్క్ ఫ్లైఓవర్ తో పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ప్రయాణం..సులభతరం కానుంది. మహబూబ్ నగర్, బెంగుళూర్, కర్నూల్, అనంతపురం వెళ్లే వారికి ట్రాఫిక్ తిప్పలు..తప్పనున్నారు.