రాత్రి పూట చెట్ల మీద నిజంగా దెయ్యాలు ఉంటాయా? అసలు నిజమేంటంటే?

-

రాత్రి పూట చెట్ల దగ్గరకు వెళ్ళకూడదని పెద్దలు పదే పదే చెబుతారు.. పొరపాటున కూడా ఏ చెట్టు దగ్గరకు వెళ్లి దానిని తాకకూడదు, అలా చేస్తే దుష్టశక్తుల బారిన పడే ప్రమాదం ఉందంటారు. అందుకే రాత్రిపూట ఏ చెట్టు కిందకు వెళ్లకూడదని, చెట్టు కింద నిద్రించకూడదని చెబుతారు. ఈ చెట్లు నిజంగా రాత్రి పూట మనుషులను చంపేస్థాయా? రాత్రి పూట చెట్లపైన దెయ్యాలు ఉంటాయా..? రాత్రిపూట చెట్టు కింద పడుకోవడం ఎందుకు మంచిది కాదు..లేక మరేదైనా కారణం ఉందా.. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నిజానికి చెట్లు కూడా మనలాగే ఊపిరిని పీల్చుకుంటాయి.. కార్బన్ డై ఆక్సైడ్‌ని పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని ఇప్పటికే శాస్త్రీయ పరిశోధనల ద్వారా తెలిసింది. కానీ చెట్లు పగటిపూట మాత్రమే ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. రాత్రి పూట కాదు. చెట్ల శ్వాసక్రియ కిరణజన్య సంయోగక్రియ ద్వారా జరుగుతుంది. ఈ కిరణజన్య సంయోగక్రియకు సూర్యకాంతి అవసరం. రాత్రిపూట సూర్యకిరణాలు అందుబాటులో ఉండదు.. అందుకే అవి కార్భన్ డై ఆక్సైడ్‌ను తీసుకోలేవు..అందుకే రాత్రి పూట చెట్ల కింద నిల్చుంటే ప్రాణ వాయువు అందక మూర్చ వచ్చి ఊపిరి ఆడక చనిపోతారు.

అంతేకాదు..అనేక జంతువులు ,పక్షుల కీటకాలు చెట్లపై తమ నివాసాలను ఏర్పరచుకుంటాయి. రాత్రిపూట అవి కూడా విశ్రాంతి తీసుకుంటుంటాయి.. వీరు చెట్టు దగ్గరకు వెళ్లడం వల్ల అవి కూడా కలవరపడతాయి. మీమిల్ని కూడా కలవరానికి గురిచేస్తాయి. పూర్వీకులు వాటిని మనలాంటి జీవులుగా గౌరవించారు. అందుకే మన పెద్దలు రాత్రిపూట చెట్టు దగ్గరికి వెళ్లకూడదనే సంప్రదాయాన్ని పాటిస్తూ రాత్రిపూట చెట్లపై దెయ్యం ఉంటుందనే ప్రచారం..ఇదండి అసలు మ్యాటర్.. దెయ్యాలు లేవు ఏం లేవు.. ప్రాణ వాయువు లేక చనిపోతారు..

Read more RELATED
Recommended to you

Latest news